తమ్ముడు ఆనంద్‌ను చూసి గర్విస్తున్నానంటున్న రౌడీ హీరో!
on Nov 23, 2020
తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా, అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో రిలీజ్ అయిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మూవీపై విజయ్ దేవరకొండ ప్రశంసల జల్లు కురిపించాడు. స్పెషల్, చార్మింగ్ ఫిల్మ్‌గా దాన్ని అభివర్ణించిన విజయ్ తన తమ్ముడు ఎంచుకుంటున్న కథలను, వాటికి లైఫ్ ఇవ్వడానికి అతను పడుతున్న తపనను చూసి గర్వపడుతున్నానని చెప్పాడు.
తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేసిన విజయ్, ఆ ప్రాజెక్టులో భాగమైన ప్రతి ఒక్కరినీ అభినందించాడు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన వినోద్ అనంతోజు నుంచి హీరోయిన్ వర్ష బొల్లమ్మ, సపోర్టింగ్ కాస్ట్, టెక్నీషియన్లను పేరుపేరునా ప్రస్తావించాడు. "యంగ్ బాయ్ వినోద్ అనంతోజు అందంగా రాసి, డైరెక్ట్ చేశాడు. ఐ లవ్ యు. నేను చూడగలను.. నీ లోపలి నుంచి ఎంతగా ఇది వచ్చిందో. ఫిల్మ్ ఇండస్ట్రీలో నీ రాకను తెలియజేశావు, నీ ప్రతిభను గుర్తించేలా చేశావు. నేనెప్పుడూ నీకు అండగా ఉంటాను. ఇది నీకు టెర్రిఫిక్ ఫస్ట్ ఫిల్మ్ కాదు, టెర్రిఫిక్ ఎనీ ఫిల్మ్" అని రాశాడు.
తమ్ముడు ఆనంద్ గురించి ప్రస్తావిస్తూ, అతడు తనదైన మార్గాన్ని క్రియేట్ చేసుకుంటున్నందుకు ఆనందం వ్యక్తం చేశాడు. "నా లిటిల్ బాయ్ రాఘవ/ ఆనంద్ దేవరకొండ, ఒక సోదరునిగా నువ్వు నన్ను గర్వించేలా చేశావు. నువ్వు ఎంచుకుంటున్న చాయిస్‌లు, నువ్వు ఎంచుకుంటున్న కథలకు లైఫ్ ఇస్తుండటం చూసి నేనెంతో గర్విస్తున్నా. నీదైన మార్గాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. నీతో పాటు కొత్త కథలు, దర్శకులు, నటులను మరింత మందిని తీసుకురావడం కొనసాగిస్తావని ఆశిస్తున్నా" అని రాసుకొచ్చాడు విజయ్.
Also Read