"టైమ్ ఎలా ఎగురుతోంది.. నిన్నే అన్నట్లుగా ఉంది".. అనిల్‌కు మహేశ్ బర్త్‌డే విషెస్
on Nov 23, 2020
నవంబర్ 23 డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్‌డే. ఈ సందర్భంగా అతని అభిమానులు ట్విట్టర్‌ను బర్త్‌డే శుభాకాంక్షలతో ముంచెత్తున్నారు. దాంతో పాటు #SarileruNeekevvaru హ్యాష్‌ట్యాగ్ కూడా టాప్ ట్రెండ్స్‌లోకి వెళ్లింది. 'సరిలేరు నీకెవ్వరు' హీరో సూపర్‌స్టార్ మహేశ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ పిక్చర్‌ను షేర్ చేసి, అనిల్‌కు హృదయాన్ని స్పృశించే బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. ఆయన షేర్ చేసిన పిక్చర్ తమ సినిమా సెట్స్‌పై గత ఏడాది ఇదే రోజు జరిగిన అనిల్ బర్త్‌డే వేడుకకు సంబంధించినది. అందులో అనిల్‌కు మహేశ్ కేక్ తినిపిస్తున్నారు. "టైమ్ ఎలా ఎగురుతోంది.. నిన్నే అన్నట్లుగా ఉంది.. నా ఫేవరేట్ డైరెక్టర్స్‌లో ఒకరైన అనిల్ రావిపూడికి హ్యాపియెస్ట్ బర్త్‌డే. నువ్వు చేసే ప్రతి దానిలో నీకు అంతా సంతోషం, సక్సెస్ లభించాలని ఆశిస్తున్నాను" అని రాసుకొచ్చారు మహేశ్.
అనిల్ నాలుగో హిట్ 'ఎఫ్2'లో హీరోగా నటించి, ఇప్పుడు 'ఎఫ్3'లో నటించడానికి రెడీ అవుతున్న విక్టర్ వెంకటేశ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అనిల్ సోలో ఫొటోను షేర్ చేసి, "Happy birthday @AnilRavipudi. hope you have a great year ahead" అని విషెస్ చెప్పారు.
ఇక అనిల్ మూడో హిట్ 'రాజా ది గ్రేట్' హీరో రవితేజ ఆ సినిమా సెట్స్‌పై తామిద్దరు ఉన్న పిక్చర్‌ను షేర్ చేసి, "Happy birthday @AnilRavipudi ! Hope you have a great one. Wishing you the best of everything!" అని ట్వీట్ చేశారు.
అనిల్‌కు శుభాకాంక్షలు అందజేసిన వారిలో 'సుప్రీమ్' హీరో సాయిధరమ్ తేజ్, రామ్ పోతినేని, సందీప్ కిషన్, దేవి శ్రీప్రసాద్, మెహర్ రమేశ్ తదితరులున్నారు.
Also Read