విజయ్ నేషనల్ రికార్డ్! ఎందులో అంటే...
on Sep 18, 2020
లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న బిగ్ ఫిల్మ్ 'మాస్టర్' రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్. ఆ సినిమాలో అతను విజయ్ సేతుపతితో తలపడుతూ కనిపించనున్నాడు. సొసైటీలో సాధారణ పరిస్థితులు నెలకొని, థియేటర్లు తెరుచుకోగానే ఆ సినిమా సాధించే విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అభిమానులతో పాటు ఇండస్ట్రీ అంతా ఎదురు చూస్తోంది.
'మాస్టర్' సినిమా షూటింగ్ సందర్భంగా తమ అభిమాన హీరోను కళ్లారా చూడాలని నైవేలిలో భారీ సంఖ్యలో జనం గుమికూడారు. వ్యాన్ పైకి ఎక్కి, ఫ్యాన్స్ అందర్నీ విష్ చేసిన విజయ్, వాళ్లతో వ్యాన్ టాప్ నుంచే సెల్ఫీ తీసుకున్నాడు. తర్వాత దాన్ని ఫిబ్రవరి 10న తన సోషల్ మీడియా హ్యాండిల్లో "థాంక్యూ నైవేలి" అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు.
విజయ్ ట్వీట్ చేసిన ఆ సెల్ఫీ ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక సంఖ్యలో రిట్వీట్ అయిన ట్వీట్‌గా నిలిచింది. ఇప్పటివరకూ దాన్ని 1.48 లక్షల మంది రిట్వీట్ చేయగా, 3.58 లక్షల లైక్స్ వచ్చాయి. స్పెషల్ హ్యాష్‌ట్యాగ్స్, పోస్టర్లతో ఈ ఫీట్‌ను విజయ్ ఫ్యాన్స్ ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
'మాస్టర్' మూవీ తర్వాత ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్లో నాలుగో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు విజయ్. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రం 2021 మొదట్లో ప్రారంభం కానున్నది.
Also Read