బిగ్ బాస్ 4: "ఉండలేకపోతున్నా.. నిద్రపడతలేదు.." ఏడ్చేసిన గంగవ్వ
on Sep 18, 2020
బిగ్ బాస్ 4 లేటెస్ట్ ఎపిసోడ్లో జోకర్ వేషంలో హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన జబర్దస్త్ అవినాష్‌కు హౌస్ మెంబర్స్ స్వాగతం చెప్పారు. అతను లోపలికి వచ్చాక గంగవ్వ ఆశీర్వాదాలు తీసుకున్నాడు. గంగవ్వ ఆరోగ్యం కాస్త బాగాలేకపోవడంతో రెస్ట్ తీసుకుంది. లాస్య, అరియానా ఆమెకు సహాయంగా ఉన్నారు. అదే సమయంలో ఆమెను కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మని బిగ్ బాస్ పిలిచాడు. అఖిల్ సహాయంతో కొంతదూరం నడిచిన గంగవ్వను లాస్య కన్ఫెషన్ రూమ్‌లోకి తీసుకువెళ్ళి ఎక్కడ కూర్చోవాలో చెప్పింది. నెమ్మదిగా మాట్లాడమని, బిగి బాస్ అడిగిన దానికి సమాధానం చెప్పమని సూచనలు చేసింది.
మొదటివారం వీకెండ్ లోనే "ఉండలేకపోతున్న.. నిద్ర పడతలేదు.. నేను వెెళ్లిపోతా.." అంటూ నాగార్జునకు గంగవ్వ చెప్పింది. ఆయన "మావారంతా నిన్ను బాగా చూసుకుంటారు" అని హామీ ఇచ్చాడు. "అయితే నిన్ను పంపించాల్సింది నేను కాదు ప్రేక్షకులు" అంటూ నాగ్ ఆమెను బుజ్జగించారు. అయితే ఏసీ రూంలు, ఎండతగలకపోవడం, సరైన రెస్ట్ లేకపోవడం వల్ల తాను అనారోగ్యం బారిన పడ్డానని, ఒళ్ళునొప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. ఇక్కడ ఉండటం తన వల్ల కావడం లేదని ఏడ్చిన గంగవ్వను డాక్టర్ వద్దకు వెళ్లమని బిగిబాస్ సూచించాడు. మీ ఆరోగ్యం త్వరలోనే కుదటపడుతుందని భరోసా ఇచ్చాడు.
లాస్య బిగ్ బాస్ సూచనల మేరకు గంగవ్వను డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళింది. డాక్టర్ ఇచ్చే సూనచలు ఏంటనేవి నెక్ట్స్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. అయితే గంగవ్వ బిగ్ హౌస్ నుంచి వెళ్ళిపోతే చాలామంది ప్రేక్షకులు బిగ్ బాస్ కు దూరం అవుతారని భావిస్తున్నారు. మొదటివారం ప్రతిరోజూ హూషారుగా హౌస్ లోని అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న గంగవ్వ ఈ వారం కాస్త డల్ గానే ఉంది. రెండోవారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆమెంతట ఆమె ఎలిమినేషన్ జాబితాలోకి వచ్చింది. మరి ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హౌస్ నుంచి పంపిస్తారా.. ప్రేక్షకుల కోసం హౌస్ లోనే కొనసాగిస్తారా అనేది వేచిచూడాల్సిందే...