' ప్రేమమ్ ' లో వెంకీ కన్ఫామ్ అంటున్నారు..!
on Jun 9, 2016
టాలీవుడ్ హీరోల్లో అత్యంత సక్సెస్ ఫుల్ కెరీర్ గ్రాఫ్ ఎవరిది అంటే విక్టరీ వెంకటేష్ పేరే చెప్పాలి. సినిమాలో కథ తప్ప మిగిలినవన్నీ సెకండరీయే అని ఆయన భావిస్తారు. అందుకే ఆయన ట్రాక్ రికార్డ్ ఆ రేంజ్ లో ఉంది. అయితే ఇప్పటి వరకూ అతిథి పాత్రలో చేయని వెంకీ, ప్రేమమ్ లో ఒక ముఖ్య పాత్రలో కాసేపు కనిపిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకూ ఎవరూ ఖరారు చేయనప్పటికీ, మేనల్లుడి కోసం వెంకీ ఒప్పుకోక తప్పలేదని సమాచారం.
మళయాళ ప్రేమమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ప్రేమమ్ లో హీరో పాత్రతో మంచి అనుబంధం ఉన్న ఒక కీలక పాత్రను వెంకీ పోషించారట. ఇప్పటికే షూటింగ్ కూడా అయిపోయిందని అంటున్నారు సినీజనాలు. అయితే అసలు విషయాన్ని మూవీ టీం ప్రకటిస్తే తప్ప తెలీదు. ఒక వేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం, అక్కినేని దగ్గుబాటి ఫ్యాన్స్ కు పండగే. వెంకీ విషయానికొస్తే, తన బాబు బంగారం సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మధ్యే రిలీజ్ చేసిన మూవీ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే.