భీష్మ' ముందు అవి నిలబడతాయా?
on Feb 20, 2020
నితిన్, రష్మిక జంటగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన 'భీష్మ' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గురువారం రాత్రికి అమెరికాలో ప్రీమియర్ షోలు పడతాయి. శుక్రవారం సాయంత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనూ రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. అయితే... రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాటే వాటే బ్యూటీ పాట, నితిన్ రష్మిక జంట సినిమాపై అంచనాలు పెంచాయి. ట్రైలర్స్ కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. నితిన్ పెళ్లి కుదరడం, రష్మిక కుక్క బిస్కెట్ ఒక చిన్న బైట్ కొరకడం వంటి వార్తలు బాగా వైరల్ కావడంతో సినిమాకు పబ్లిసిటీ బాగా దక్కింది. క్రేజీ కాంబినేషన్ లో సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ శుక్రవారం ఈ సినిమా ఒక్కటే కాదు మరో నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'వసంత కాలం' శుక్రవారం విడుదల అవుతుంది. కమల్ హాసన్ హీరోగా చీకటి రాజ్యం చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రి తోలేటి తీసిన ఓ తమిళ సినిమాకు అనువాదం ఇది. సరైన పబ్లిసిటీ లేని కారణంగా ఈ సినిమా ఒకటి వస్తుంది అనేది ప్రేక్షకులకి తెలియలేదు.
ఈ శుక్రవారం విడుదల అవుతున్న మరో సినిమా 'ప్రెజర్ కుక్కర్'. పిల్లలపై చదువుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అమెరికా వెళ్లడానికి ఎన్ని కష్టాలు పడతారు? ఒక్కసారి అమెరికా వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ల తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడతారు? అనే కథాంశంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు అనేది ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ యాసలోని సంభాషణలు, రాహుల్ రామకృష్ణ సినిమాకు ప్లస్ అని చెప్పాలి. చిన్న చిత్రమే అయినప్పటికీ అర్బన్ ఆడియన్స్ లో ఈ సినిమాకు కొంత క్రేజ్ ఏర్పడింది. అయితే థియేటర్లకు ఎంతమంది వస్తారు అనేది చూడాలి.
'చీమ - ప్రేమ... మధ్యలో భామ', 'వలయం' అనే మరో రెండు సినిమాలు కూడా ఈ శుక్రవారం విడుదల అవుతున్నాయి. 'భీష్మ' దూకుడు ముందు ఈ సినిమాల్లో ఎన్ని నిలబడ్డాయో చూడాలి.
Also Read