నీళ్ల లోపల మీసం తిప్పాడు!
on Sep 7, 2019
"మందు.. సిగరెట్.. అమ్మాయిలా.. శత్రువు కూడా వ్యసనమే. ఆ వ్యసనానికి నేనూ బానిసనే".. ఇది 'తిప్పరా మీసం' సినిమా టీజర్లో శ్రీవిష్ణు నోటి నుంచి వచ్చిన డైలాగ్. ఈ డైలాగ్‌కీ, మొత్తంగా టీజర్‌కీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆన్లైన్లో ఈ టీజర్ వైరల్ అయింది.
శ్రీవిష్ణు అంటే కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. మొన్నటి 'నీదీ నాదీ ఒకే కథ' కానీ, నిన్నటి 'బ్రోచేవారెవరురా' కానీ ఆ విషయాన్నే తెలియజేస్తాయి. ఇప్పుడు 'తిప్పరా మీసం' అనే సినిమాని శ్రీవిష్ణు చేస్తున్నాడనే సరికి, కంటెంట్ డ్రివెన్ మూవీస్‌ని ఇష్టపడే ప్రేక్షకులు ఆసక్తి కనపరుస్తున్నారు. మొదట టైటిల్‌తోనే ఆకట్టుకున్న ఈ సినిమాలో మెలితిప్పిన మీసం, ఫుల్ బియర్డ్‌తో శ్రీవిష్ణు కనిపిస్తున్న తీరు కూడా ఆకట్టుకుంది.
ఇదివరకు నారా రోహిత్, శ్రీవిష్ణుతో చేసిన 'అసుర' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన ప్రొడ్యూసర్ కృష్ణవిజయ్ ఎల్. డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. 'కాంచన 3', 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాల్లో నటించిన నిక్కీ తంబోలి నాయికగా నటించిన ఈ సినిమాలో ఇంటెన్స్ సీన్స్కూ, యాక్షన్ సీన్స్కూ కొదవలేదని టీజర్‌ని బట్టి తెలుస్తోంది. అండర్ వాటర్‌లో శ్రీవిష్ణు మీసం తిప్పే సీన్ ఆసక్తి కలిగిస్తోంది. రివెంజ్ యాక్షన్ డ్రామాగా తయారవుతున్న ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి మ్యూజిక్, సిద్ సినిమాటోగ్రఫీ ఎస్సెట్‌గా కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో శ్రీవిష్ణు మరోసారి ప్రేక్షకుల్ని మెప్పిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.