'అంధాధున్' తెలుగు రీమేక్: టబు పాత్రలో తమన్నా!
on Sep 19, 2020
ఆయుష్మాన్ ఖురానా హీరోగా హిందీలో రూపొంది ఘన విజయం సాధించిన 'అంధాధున్'ను తెలుగులో నితిన్ అఫిషియల్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసే ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానున్నది. కాగా ఒరిజినల్‌లో టబు, రాధికా ఆప్టే పోషించిన పాత్రలకు తమన్నా, నభా నటేష్ ఎంపికయ్యారు.
'అంధాధున్'లో గ్రే షేడ్స్ ఉండే రోల్‌లో టబు అమితంగా రాణించి, విమర్శకుల ప్రశంసలను అమితంగా పొందడంతో పాటు ఫిల్మ్‌ఫేర్ సహా పలు అవార్డులను గెలుచుకున్నారు. ఇప్పుడు ఆ నెగటివ్ రోల్‌ను చేసే సవాలును స్వీకరించింది తమన్నా. తొలిసారిగా ఒక బోల్డ్ రోల్‌లో తమన్నా నటించనుండటం ఇదే తొలిసారి. ఇక ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉండే ఈ చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం లభించినందుకు నభా నటేష్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 6గా తయారయ్యే ఈ చిత్రాన్ని ఎన్. సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
