సుశాంత్‌తో కృతి సనన్ డేటింగ్ చేసిందంటోంది!
on Sep 19, 2020
'రాబ్తా'లో దివంగత కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ జంటగా నటించారు. అప్పట్లో వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ముంబై కోడై కూసింది. సినిమా విడుదల సమయంలో ఇంటర్వ్యూలలోనూ డేటింగ్ రిలేటెడ్ ప్రశ్నలు ఎదురయ్యాయి. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని సుశాంత్, కృతి చెప్పారు. ఎప్పుడూ డేటింగ్‌లో ఉన్నట్టు చెప్పలేదు. సుశాంత్ మరణం తరవాత అతడి లవ్ ఎఫైర్లు మరోసారి చర్చకు వస్తున్నాయి.
సుశాంత్ మరణించే సమయానికి రియా చక్రవర్తి అతడితో ప్రేమలో ఉంది. అంతకు ముందు అంకితా లోఖండే ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. సుశాంత్ సూసైడ్ తరవాత వాళ్ళిద్దరి మధ్య పరోక్షంగా యుద్ధం కూడా నడిచింది. అయితే, కృతి సనన్ రిలేషన్ గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడింది లేదు. నటి లీజా మాలిక్ మాత్రం సుశాంత్, కృతి కొన్నాళ్లు ప్రేమించుకున్నారని అంటోంది. వాళ్లిద్దరూ ఆ విషయం పైకి చెప్పనప్పటికీ... ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఒక స్పార్క్ ఉంటుందని, అది తాను గమనించానని లీజా మాలిక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
సుశాంత్ మరణం తరవాత కృతి సనన్ సోషల్ మీడియాలో అతడి గురించి ఒక అద్భుతమైన పోస్ట్ చేసింది. అతడి అంత్యక్రియలకు హాజరైంది. తన హార్ట్ లో ఒక భాగం వెళ్లిపోయిందని పేర్కొంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
