తాప్సీకి నలుగురు ట్రైనర్లు!
on Apr 22, 2020
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిక్షనల్ బయోపిక్స్ మీద దృష్టి పెట్టింది. హిందీలో సల్మాన్ 'సుల్తాన్', తెలుగులో 'అప్పట్లో ఒకడుండేవాడు', తమిళంలో 'కణ' (తెలుగులో 'కౌసల్య కృష్ణమూర్తి'గా రీమేక్ చేశారు) ఫిక్షనల్ బయోపిక్సే. ప్రస్తుతం తాప్సీ కూడా ఒక ఫిక్షనల్ బయోపిక్ చేయడానికి రెడీ అవుతోంది. ఆల్రెడీ సినిమా అనౌన్స్ చేశారు కూడా! అదే 'రష్మీ రాకెట్'. గుజరాత్ నేపథ్యంలో అక్కడ కచ్ ఏరియా నుండి వచ్చిన అథ్లెట్ (రన్నర్) కథగా సినిమా స్క్రిప్ట్ రాశారు. కరోనా లేకపోతే షూటింగ్ స్టార్ట్ చేసేవారు. ఈ సినిమా కోసం తాప్సీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అదీ ఏకకాలంలో నలుగురి దగ్గర!
ఒక ట్రైనర్ వేగంగా ఎలా పెరిగెట్టాలో చెబుతూ 'స్ప్రింట్'లో మెళకువలు ఇస్తున్నారు. ట్రాక్ అథ్లెట్స్ కి ఇచ్చే ట్రైనింగ్ అన్నమాట. మరొక ట్రైనర్ ప్రొఫెషనల్ స్ప్రింటర్స్ కి అవసరమైన శారీరక ధారుడ్యం కోసం ఆమెకు శిక్షణ ఇస్తున్నారు. మజిల్స్ గట్రా పెంచే పనిలో తాప్సీ పడ్డారు. ఇంకొకరు న్యూట్రీషనిస్ట్. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెబుతారు. మరొకరు ఫిజియోథెరపిస్ట్. ట్రైనింగ్ లో గాయాలు కాకుండా చూసుకుంటారు. నెల రోజుల్లో ప్రొఫెషనల్ అథ్లెట్ ఫిజిక్ లోకి వస్తానని తాప్సీ అంటున్నది.