నా ట్విట్టర్ హ్యాండిల్... నా ఇష్టం
on Jul 7, 2020
కరోనా కాలంలో మంచి ఎవరు చేసినా ప్రశంసించడం చాలా అవసరమని యువ కథానాయకుడు సందీప్ కిషన్ అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోలలో ఇతడు ఒకడు. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో అప్పుడప్పుడూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. ఎవరైనా మంచి చేస్తే ప్రశంసిస్తున్నారు. అయితే, సోమవారం ఏపీలో కరోనా కారణంగా మరణించిన వ్యక్తి అంతిమ సంస్కారాల విషయంలో మానవత్వం అనేది లేకుండా అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై సందీప్ కిషన్ స్పందించవల్సిందిగా ఒక నెటిజన్ కోరాడు. 'డియర్ సందీప్ కిషన్, కోన వెంటన్... ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు?' అని ప్రశ్నించాడు.
"నేను పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాను. మంచి ఎక్కడ చేసినా నేను అప్రిషియేట్ చేస్తా. ఈ టైమ్ లో ఇంకా అవసరం. నా పొలిటికల్ నాలెడ్జ్ జీరో. రాజకీయ అవగాహన పెంచుకోవాలని కూడా అనుకోవడం లేదు. మంచి నువ్వు చేసి నా కంటపడ్డా అప్రిషియేట్ చేసే వ్యక్తుల్లో ముందు ఉంటాను. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే... నా (ట్విట్టర్) హ్యాండిల్, నా ఇష్టం" అని సందీప్ కిషన్ రిప్లై ఇచ్చాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
