బాలకృష్ణ హీరోయిన్‌పై బోయపాటి క్లారిటీ
on Jul 7, 2020
.jpg)
ఎవరు? నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన కథానాయిక ఎవరు? బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో 'సింహా', 'లెజెండ్' తరవాత ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ ఎవరు? గత కొన్ని రోజులుగా బాలకృష్ణ హీరోయిన్ విషయంలో ఫిలింనగర్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. మలయాళీ ముద్దుగుమ్మ అమలా పాల్ తదితరుల పేర్లు వినిపించాయి. దాంతో బాలకృష్ణ హీరోయిన్‌పై బోయపాటి క్లారిటీ ఇచ్చారు.
బాలకృష్ణ సరసన 'బిబి3' (బాలకృష్ణ, బోయపాటి మూడో సినిమా)లో కొత్త కథానాయికను పరిచయం చేస్తామని బోయపాటి శ్రీను తెలిపారు. మొదట స్టార్ హీరోయిన్ అయితే ఎలా ఉంటుందని ఆలోచించినప్పటికీ కొత్త కథానాయికను తీసుకోవాలని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు. సినిమాలో ఒక్క హీరోయిన్ మాత్రమే ఉంటుందని టాక్. మరో హీరోయిన్ ఉన్నప్పటికీ, హీరోకి జోడీగా కాకుండా కీలక పాత్రలో కనిపిస్తుందని సమాచారం. కరోనా తీవ్రత తగ్గినా తరవాత మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



