English | Telugu

ఇక్కడ పిచ్చోళ్లు జనాలా? గవర్నమెంటా?

on Oct 9, 2017

‘సినిమా వసూళ్లు’ అనే కాన్సెప్ట్...  ఓ మాయాజాలం. ఈ విషయం గురించి విశ్లేషిస్తే... అన్నీ తెగని వ్యవహారాలే కనిపిస్తాయ్. సినిమా విడుదలవ్వగానే... ‘సూపర్ హిట్’ అని స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. తొలి రోజు ఇన్ని కోట్లు వచ్చాయని అంకెతో సహా పేపర్ యాడ్ ఇస్తారు. వారానికి ఇంత, రెండు వారాలకు ఇంత అని ప్రకటనలు గుప్పిస్తారు. ‘మా సినిమానే నంబర్ వన్’ అని ఇంటర్వ్యూల్లో చెబుతారు. తీరా ఇన్ కం టాక్స్ వాళ్లకు లెక్కలు చూపించాల్సొచ్చేసరికి అన్నీ నష్టాలే చూపిస్తారు. అసలు ఇందులో నిజం.. ఎవరికీ అర్థంకాని విషయం.  


వచ్చిన డబ్బు వివరాలను తెలివైన నిర్మాత అయితే... బజారున వేసుకోడు. కానీ.. మన నిర్మాతలు కోటాను కోట్ల లెక్కలు పేపర్లలో చూపిస్తారు. కానీ... ఇన్ కం టాక్స్ లెక్కలు మాత్రం నష్టాల్లో చూపిస్తున్నారు. ఇక్కడ పిచ్చోళ్లు జనాలా? గవర్నమెంటా? అందుకే... ఈ పద్ధతికి అడ్డుకట్ట వేస్తూ... పారదర్శకమైన ఓ సంస్థను ఏర్పాటు చేయాలనేది చాలామంది అభిప్రాయం.  సినిమాకు బడ్జెట్ ఎంత అయ్యింది? ఎంతకు అమ్మారు? ఎంత నష్టం వచ్చింది? ఎంత లాభం వచ్చింది? ఇవన్నీ గవర్నమెంట్ కు, జనాలకూ సరిగ్గా తెలియాలంటే.. ప్రభుత్వం ఈ దిశగా ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు. 


ఇదిలావుంటే... ప్రస్తుతం ‘స్పైడర్’ సినిమా వ్యవహారం పెద్ద రచ్చకే దారి తీస్తోంది.  ఈ సినిమా దేశంలోని టాప్ 3 డిజాస్టర్స్ లో ఒకటని, 70 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చిందని.. వసూళ్ల అంకెలతో సహా చూపిస్తూ మీడియాలో ఓ ప్రోగ్రామ్ చేశాడు ఓ బాక్సాఫీస్ ఎనలిస్ట్. దీనిపై ‘స్పైడర్’నిర్మాతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ‘మా సినిమా వసూళ్లు మేం చెప్పకుండా.. మీకెలా తెలుస్తాయ్?’ అంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు. ఈ వ్యవహారంపై సదరు బాక్సాఫీస్ ఎనలిస్ట్ పై లీగల్ గా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ‘స్పైడర్’కి టాక్ తో ప్రమేయం లేకుండా 150 గ్రాస్ వచ్చిందనేది నిర్మాతల వాదన. ఆ సినిమాకి 70 కోట్ల లాస్ వచ్చిందనేది బయట టాక్. మరి వీటిలో నిజం ఎంత. నిర్మాతలు ఇప్పుడు చెబుతున్న లెక్కలే... రేపు ఇన్‌కంటాక్స్ వాళ్ల ముందు కూడా చెబుతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. 


నిజం నిర్మాతలకూ తెలుసూ, బయ్యర్లకూ తెలుసు. మరి ఎవర్ని మభ్యపెట్టడానికి ఈ స్టేట్మెంట్లు?

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here