సొహైల్ గురువు.. అమ్మ రాజశేఖర్ శిష్యుడు.. దొంగతనంలో!
on Sep 30, 2020
ఇదివరకు హిట్‌మ్యాన్‌గా వేషం ధరించిన సొహైల్ ఈసారి ఇంటిసభ్యులకు గురువయ్యాడు. ఏ విషయంలోనో తెలుసా? ఎలా దొంగతనం చెయ్యాలి? అనే విషయంలో. అవును. ఆ కథేమిటంటే.. బిగ్ హౌస్‌కు ఒక పోస్ట్ వచ్చింది. దాన్ని తీసుకోవడానికి సొహైల్, మెహబూబ్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పోస్ట్ బాక్స్ లోని లెటర్ అందుకున్నాడు మెహబూబ్. "మార్నింగ్ మస్తీలో భాగంగా ఎవరికి తెలియకుండా దొంగతనం ఎలా చేయాలో ఇంటిసభ్యులకు సొహైల్ నేర్పించాలి" అని అందులో ఉన్న విషయం చదివాడు మెహబూబ్.
అందుకు అనుగుణంగా ఇంటిసభ్యులందరినీ కూర్చోబెట్టి ఇతరుల వస్తువులను ఎలా కొట్టేయాలో నేర్పించాడు సొహైల్. అతని కిటుకులు విన్న ఇంటిసభ్యులంతా "సొహైల్ చోర్" అంటూ ఆటపట్టించారు. అమ్మ రాజశేఖర్ స్టూడెంట్ గా మారి దొంగతనం పాఠాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత టాస్క్ లో ఈ పాఠాలను ప్రాక్టికల్ గా చేసి "అమ్మ.. దొంగా!" అనిపించారు రాజశేఖర్.
Also Read