English | Telugu

ఎన్టీఆర్ గారూ... మీ టైటిల్‌కి న్యాయం చేస్తాం!

on Mar 14, 2019

'ఎదురీత'... నందమూరి తారక రామారావు 1977లో హీరోగా నటించిన సినిమా టైటిల్. ఇప్పుడు ఇదే  టైటిల్‌తో తెలుగులో ఒక సినిమా వస్తోంది. ఇందులో శ్రవణ్ రాఘవేంద్ర హీరో. 'సై', 'శ్రీమంతుడు', 'దూకుడు', 'ఏక్ నిరంజన్' తదితర సినిమాల్లో విలన్ వేషాలు వేసిన అతడికి హీరోగా ఇదే తొలి సినిమా. ఎన్టీఆర్ గారి టైటిల్ కి కచ్చితంగా న్యాయం చేస్తామని శ్రవణ్ అన్నారు. నందమూరి కల్యాణ్ రామ్ గురువారం ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ రాఘవేంద్ర మాట్లాడుతూ "మా నాన్నగారు ఒకరోజు ఈ సినిమా టైటిల్ ఏంటి? అని అడిగారు. 'ఎదురీత' అని చెప్పాను. అప్పుడాయన 'ఎదురీత' సినిమా గురించి, టైటిల్ పవర్ గురించి తెలుసా? అని  ప్రశ్నించారు. నాకు వివరించారు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారికి చెబుతున్నా... సార్, మీ టైటిల్ కి కచ్చితంగా న్యాయం చేస్తా. ఈ సినిమా చేసేటప్పుడు తండ్రి బాధ్యతలను తెలుసుకున్నా. ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనడం చేస్తే రెస్పాన్సిబుల్ ఫాదర్ అనిపించుకోరు. పిల్లలతో కొంత సమయం గడపాలని, వాళ్లకు టైమ్ కేటాయించాలని, అవసరమైతే వంట చేసి పెట్టాలని ఈ సినిమా చేసేటప్పుడు తెలుసుకున్నా. ఇదొక ఎమోషనల్ ఫిల్మ్. ప్రతి ఒక్క తండ్రికి హృదయానికి హత్తుకుంటుంది. సినిమా చూసి ఇంటికి వెళ్ళాక పిల్లల్ని గట్టిగ హత్తుకుంటారు" అన్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. గురువారం  టీజర్ విడుదల చేశారు.  త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల చేయనున్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here