'రొమాంటిక్' కాదు... యమా హాట్ గురూ!
on Mar 14, 2019

దర్శకుడు పూరి జగన్నాథ్ తన సినిమాల్లో హీరోయిన్లను మ్యాగ్జిమమ్ హాట్ హాయ్ గా చూపిస్తారు. ఆయన కథ, కథనం, సంభాషణలు అందిస్తున్న తనయుడి తాజా సినిమాలోనూ హాట్ హీరోయిన్లను సెలెక్ట్ చేశారు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'రొమాంటిక్'. ఇందులో హీరోయిన్లు మాత్రం 'రొమాంటిక్' అనే పదానికి మించి అందాలు ఆరబోసేవారే. ఒక్క ముక్కలో చెప్పాలంటే యమా హాట్. ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన కేతికా శర్మ అనే మోడల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫొటోల్లో ఆమె హాట్ హాట్ పోజులు ఇచ్చింది. ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్లో హిందీ టీవీ యాంకర్, మోడల్, ఫ్యాషన్ డిజైనర్, యాక్టర్ మందిరా బేడీ నటిస్తున్నారని ఈ రోజు ప్రకటించారు. మందిరా బేడీ అంటే హాట్ హాట్ ఫోజులు, యాక్టింగ్ కి కేరాఫ్ అడ్రస్. వీరిద్దరి పాత్రలను పూరి ఎలా డిజైన్ చేశారో మరి. ప్రస్తుతం గోవాలో 'రొమాంటిక్' షూటింగ్ జరుగుతోంది. మందిర బేడీ షూటింగులో పాల్గొంటున్నారు కూడా. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్ కూడా గోవాలో జరుగుతోంది. ప్రతిరోజూ షూటింగ్ పూర్తయిన తరవాత రెండు యూనిట్స్ కలిసి పార్టీలు చేసుకుంటున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



