ఆకలేస్తే..ఉల్లిపాయలు ఉడకపెట్టుకుని తిన్నా..!
on Jul 25, 2017

సినిమా ఒక రంగుల ప్రపంచం..అభిమానుల చేత జేజేలు కొట్టించుకోవాలని..ఆటోగ్రాఫ్‌లు పెట్టాలని..సినీ ప్రపంచంలో తనకంటూ ఒక పేజీ ఉండాలని కోరుకుంటూ హైదరాబాద్ రైలు ఎక్కేవారు ఎంతోమంది ఉన్నారు. అందరికీ అవకాశాలు రాకపోవచ్చు..వచ్చినవారు అనుకున్న స్థాయికి ఎదగపోవచ్చు..అలాంటి వారందరికీ ఒక మంచి సూచన ఇచ్చాడు..సీనియర్ నటుడు, మా అధ్యక్షుడు శివాజీరాజా. ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తొలిరోజుల్లో నటుడిగా పడ్డ కష్టాలను వివరించారు..నాలుగు రోజుల పాటు భోజనం చేయకుండా ఉల్లిపాయలు ఉడకపెట్టుకుని తిన్నానని..సినిమా రంగంలో ఎదగాలంటే కెమెరా ముందు నటించడం కంటే కెమెరా వెనుక నటించడం బాగా రావాలని అది వచ్చినవాడు ఎక్కడికో వెళతాడని..రాని వాడి అడ్రస్ గల్లంతేనన్నాడు శివాజీరాజా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



