తమన్నా డాక్టర్ అయ్యింది
on Jul 25, 2017

తమన్నా ‘డాక్టర్’ అయ్యింది. సినిమలో డాక్టర్ వేషం వేసిందనుకుంటున్నారా? కాదు.. నిజంగానే డాక్టర్ అయ్యింది. అసలు తమన్నా నటి కావాలని మొదట్నుంచీ అనుకోలేదట. డాక్టర్ చేయాలనే అనుకుందట. కానీ... తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచి నటిగా మారింది. కానీ...ఇన్నాళ్లకు ఎలాగోల డాక్టర్ కావాలనే తన కోరికను మాత్రం తీర్చేసుకుందీ మిల్కీ బ్యూటీ. డాక్గర్ అనిపించుకోవాలంటే... మూడు దారులున్నాయి. ఒకటి ఎంబీబీఎస్ చేయడం. రెండు ఏదైనా అర్హతగల, ఆచరణీయమైన విషయంపై రీసెర్చ్ చేయడం. మూడు... ఏ రంగంలోనైనా అద్భుతమైన సేవ చేయడం.. ఈ మూడింటిలో ఏ ఒక్కటి చేసినా డాక్టర్ అయిపోవచ్చు.
మరి తమన్నా ‘డాక్టర్’ ఎలా అయ్యింది? అనేగా మీ ప్రశ్న. దక్షిణాది సినీరంగంలో కథానాయికగా తాను చేసిన సేవకు గాను.. కాన్ఫిడిరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ కమీషన్(సీ ఐ ఏ సీ) అనేఎన్జీవో సంస్థ తమన్నాకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ నెల 22న అహ్మదాబాద్ లో జరగిన ఈ కార్యక్రమంలో తమన్నా భావోద్వేగానికి లోనయ్యిందని తెలిసింది. కళాకారుల ప్రతిభకు అసలైన గుర్తింపు ప్రజాభిమానం అయితే... దానికి మరింత వెన్నె తెచ్చేది అవార్డులు. అవి అందుకుంటే... కళాకారుల ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు తమన్నా కూడా అలాంటి ఆనందంలోనే ఉంది. ఇప్పటికే తమన్నా... తమిళనాట ‘కలైమామణి’అవార్డు అందుకుంది. ఇది తమిళ తెరపై వెలగిన మహానటీమణులు అందుకున్న అవార్డ్. ఇంకా... అసియా విజన్ అవార్డ్, అసియనేటి ఫిల్మ్ అవార్డ్, పలు సౌత్ స్కోప్ అవార్డులు, 2017వ సంవత్సరానికి గాను దయవతి మోది అవార్డ్ తమన్నా సొంతం చేసుకుంది. అంతేకాదు... ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు నామినేషన్ కూడా అయ్యింది. ఇన్ని అవార్డులు తీసుకున్న మిల్కీ బ్యూటీ కీర్తి కిరీటంలో ఈ ‘డాక్టరేట్’ ఓ కలికితురాయి. అని వేరే చెప్పాలా? కంగ్రాట్స్ తమన్నా...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



