కష్టాల్లో పవన్ నిర్మాత.. రాధకి పెద్ద దెబ్బ
on May 8, 2017
.jpg)
బీవీఎస్ఎన్ ప్రసాద్..టాలీవుడ్‌లో పెద్ద నిర్మాతల్లో ఒకరు..ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలతో సినిమాలు తీసిన నిర్మాత. వరుసగా సినిమాలు చేస్తోన్న స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పుడు పీకల్లోతు కష్టాలతో సతమతమవుతున్నాడట. ప్రజంట్ శర్వానంద్ హీరోగా చంద్రమోహన్ దర్శకత్వంలో "రాధ" అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు ప్రసాద్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ విజయవాడలో నిర్వహించారు. కానీ ఇది ఎంత మందికి తెలుసు.."రన్‌రాజా రన్", "ఎక్స్‌ప్రెస్ రాజా", "శతమానం భవతి" వంటి హిట్ల తర్వాత శర్వానంద్ నటిస్తున్న సినిమా కాబట్టి రాధపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి.

కానీ ఎక్కడా ఆ స్థాయి ప్రమోషన్స్ కనిపించలేదు..ఆర్థికపరమైన సమస్యల వల్లనే రాధ ప్రి రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించలేకపోయారని ఫిలింనగర్ టాక్. అత్తారింటికి దారేది తర్వాత నిర్మించిన సాహసం, దోచేయ్ భోగవల్లికి నష్టాలను మిగిల్చింది. దీంతో అత్తారింటి లాభాలను ఇటు మళ్లీంచాల్సి వచ్చింది. రాధకి కూడా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అవ్వడంతో ప్రమోషన్స్‌కి సరైన ఆర్థిక వనరులు సమకూరకపోవడంతో పబ్లిసిటీ వీక్ అయ్యిందని అంటున్నారు. ఈ కష్టాలకు తోడు బాహుబలి దండయాత్ర కొనసాగుతున్న సమయంలో ఈ నెల 12న రాధను రిలీజ్ చేయ్యాలనుకోవడం "సూసైడల్ డిసెషన్" అంటున్నారు. సినిమా హిట్ అయితే ఒకే లేదంటే ప్రసాద్ ఇండస్ట్రీకి దూరమవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



