బాహుబలి@1000 కోట్లు..ఎవరైనా బద్దలు కొట్టగలరా..?
on May 7, 2017

ఇప్పటి వరకు భారతీయ సినిమాకు ఒక కల ఉండేది..ఒక్కసారైనా 1000కోట్ల మార్క్‌ను రీచ్ అవ్వాలని..కాని ఇంతవరకు ఏ సినిమా కూడా ఆ ఫీట్‌ను అందుకోలేదు. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి-2 దానిని నిజం చేస్తుందని విడుదలకు ముందు అందరూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు వారి అంచనా నిజం అయ్యింది. ఏప్రిల్ 28న విడుదలైన అన్ని చోట్లా రికార్డు కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న బాహుబలి ఇవాళ ఉదయానికి వెయ్యికోట్ల వసూళ్లు సాధించి భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రకటించింది. ఒక ప్రాంతీయ చిత్రం వంద కోట్లు వసూలు చేయడమే కష్టంగా ఉన్న సమయంలో 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా బాహుబలి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇదే జోష్‌ని కంటిన్యూ చేస్తే బాహుబలి-2 రూ.1500 కోట్లు దాటేస్తుందని అంచనా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



