లైంగిక వేధింపుల కేసులో పూనమ్ పాండే భర్తకు బెయిల్
on Sep 23, 2020
నటి, మోడల్ పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబేపై లైంగిక వేధింపులకు గురిచేసి బెదిరించాడని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు సామ్ బాంబేని అరెస్ట్ చేశారు. కాగా గోవాలోని కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ షానూర్ ఆడి రూ. 20 వేల పూచీకత్తుపై నిందితునికి బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. సామ్ బుధవారం నుండి నాలుగు రోజులు కెనకోనా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలని, ఫిర్యాదుదారు విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన భర్త తనను వేధింపులకు గురిచేశాడని, తనపై దాడి చేసి బెదిరించాడని పూనమ్ సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. దక్షిణ గోవాలోని కెనకోనా గ్రామంలో ఈ సంఘటన జరిగిందని, ప్రస్తుతం పాండే ఒక సినిమా షూటింగ్లో పాల్గొంటోందని సమాచారం.
సెప్టెంబర్ 10 న, పూనమ్ పాండే తమ వివాహ వేడుకకు సంబంధించిన పిక్చర్లను పంచుకోవడం ద్వారా సామ్ బాంబేతో తన వివామం జరిగినట్లు ప్రకటించింది. సామ్ బాంబే కూడా వాటిని షేర్ చేశాడు. కానీ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి అన్ని చిత్రాలను తొలగించాడు.
Also Read