రివ్యూ బ్యాడ్..సినిమా సూపర్ హిట్..!
on Jun 8, 2016
అల్లు అర్జున్ సరైనోడు సినిమాను యావరేజ్ సినిమా అని, ఏమాత్రం ఆకట్టుకోలేదు అని రాశారు. రివ్యూలన్నీ పూర్తి నెగటివ్ గానే వచ్చాయి. కానీ ఏం మ్యాజిక్ జరిగిందో, కలెక్షన్లు మాత్రం కుమ్మేసుకున్నాడు. ఇంకా చాలా చోట్ల కుమ్ముకుంటూ 50 రోజులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం కేరళలో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. విచిత్రంగా క్రిటిక్స్ దుమ్మెత్తిపోసిన సినిమాకు ఆడియన్స్ 100 కోట్లు కురిపించారు. అన్నీ కలిసొస్తే తప్ప ఇలాంటి మ్యాజిక్ సాధ్యం కాదు. ఇదే మ్యాజిక్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రిపీట్ అయింది. మల్టీస్టారర్ కామెడీగా రిలీజైన హౌస్ ఫుల్ 3 సినిమాను మొదటి రోజు నుంచే రివ్యూయర్లు చీల్చి చెండాడారు. ఇది కామెడీ అంటారా అంటూ ఆడేసుకున్నారు.
కానీ రిలీజైన ఐదు రోజులకు ఈ సినిమా కలెక్షన్ ఎంతో తెలుసా..? అక్షరాలా వందకోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్. రివ్యూలు నెగటివ్ గా వచ్చిన ఈ సినిమాలో జనాలకు ఏం నచ్చిందో ఏమో కానీ, సినిమాకు మాత్రం కలెక్షన్స్ ను కురిపిస్తున్నారు. భారత్లో 73.02 కోట్లు కొల్లగొడితే, విదేశాల్లో 27.01 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది హౌస్ ఫుల్ 3. దీన్ని అఫీషియల్ గా ప్రకటించింది ఈరోస్ సంస్థ. ఈ విజయాన్ని చూసి ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు మూవీ టీం. అభిమానులందరికీ కృతజ్ఞతలు చెబుతూ హీరో అక్షయ్ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ వచ్చిన బాలీవుడ్ సినిమాలను హౌస్ ఫుల్ చాలా కంఫర్టబుల్ గా బీట్ చేసేస్తుందంటున్నారు ట్రేడ్ పండితులు. ఆడియన్స్ కు నచ్చిన సినిమాను ఏ రివ్యూలు ఆపలేవు మరి..