English | Telugu

మీకు అబ్బాయ్ పుడితే ‘ఆయన’ పేరు పెడతారా?

on Oct 6, 2017

 

పెళ్లంటే మామూలు విషయమా? ఆకాశమంత పందిరి.... భూదేవంత పీటలు... వచ్చే అతిథులు... స్నేహితులు... సందళ్లు... సంబరాలు.. అలకలు... అల్లర్లు.. గారాలు... అబ్బో.. అదొక పెద్ద ప్రహసమేలేండి. అయితే... ఈ సందడంతా... పెళ్లివారిదే. పెళ్లి చేసుకునేవారిది కాదు. పాపం...వాళ్ల మనసుల్లో ఏవేవో ఆలోచనలు. జీవితం ఎలా ఉండబోతోందనే టెన్షన్. అందుకే... సాధ్యమైనంతవరకూ పైపై నవ్వులతోనే కనిపిస్తారు. 

అయితే... నాగచైతన్య, సమంతలకు ఆ టెన్షన్ లేదు. ఇద్దరి జీవితం ఎలా ఉండబోతోందో వారికి పూర్తిగా క్లారిటీ ఉంది. ఇప్పటికే పీకల లోతు ప్రేమలో ఉన్న ఈ ప్రేమికులకు బిడియం ఏముంటుంది చెప్పండి? చుట్టూ ఉన్నవారంతా పరిచయస్తులే.. అందుకే పెళ్లి వ్యవహారాలు పెద్దలు చూసుకుంటుంటే... సమంత మాత్రం తీరిగ్గా అభిమానులతో చాటింగులు చేసేస్తోంది. వాళ్లు కూడా సామ్ ని భలే ప్రశ్నలు అడిగారు. 

 

 

‘మీకు అబ్బాయ్ పుడితే... గౌతమ్ మీనన్ పేరు పెడతారా? ఎందుకంటే మిమ్మల్ని కలిపింది ఆయన సినిమానేగా?’ అనడిగాడు ఓ ఫ్యాన్. దానికి చిరువ్వునే సమాధానంగా ఇచ్చింది సామ్. ఇంకో అభిమానేమో... ‘ఫ్యూచర్లో చైతూ ఎక్కువ చేస్తే చెప్పు... సామ్ ఆర్మీ రెడీగా ఉంది’ అని భరోసా ఇచ్చేశాడు. దానికి ‘సో.. క్యూట్’ అని రిప్లై ఇచ్చింది సమంత.  చైతూ నుదుటిపై సమంత ముద్దిస్తున్న ఓ చిత్రాన్ని పెన్సిల్ తో గీసి ఓ అభిమాని పోస్ట్ చేశాడు. అతనికి ‘వావ్ థ్యాంక్యూ’ అని బదులిచ్చింది సమంత. ‘పెళ్లి తర్వాత మీ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూసే అభిమానులకు మీరేం చెబుతారు?’ అని ఓ ప్రశ్నను సంధించాడు ఓ అభిమాని. దానికి సమంత...‘కమ్ బ్యాక్ అనే పదానికి ఇక్కడ స్థానం లేదు. ఎందుకంటే...నేను సినిమాల నుంచి తప్పుకోలేదు. తప్పుకోను కూడా. ఎప్పటికీ నటిస్తూనే ఉంటా’ అని సమాధానం ఇచ్చి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది సమంత. 

సో... పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ కానుందన్నమాట ఈ జంట. రాబోతున్న క్రిస్మస్ సీజన్ లో యుఎస్ఏ కి హనీమూన్ ట్రిప్ కి కూడా ప్లాన్ చేస్తున్నారు చైతూ, సమంత. 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here