‘రాజుగారి గది ’ చైతూ చూడడట!
on Oct 5, 2017
కట్టుకున్న భార్యను దెయ్యంలా చూడాలని ఏ భర్తా కోరుకోడు. ప్రేమించి పెళ్లాడిన వాడైతే... అసలు కోరుకోడు. అందుకే... ‘రాజుగారి గది ’ సినిమా చూడను గాక చూడను అని తేల్చిచెప్పేశాడట నాగచైతన్య. ఈ విషయాన్ని స్వయంగా చైతూ తండ్రి, సమంత మామగారు అయిన నాగార్జునే చెప్పాడు.
‘రాజుగారి గది2’లో సమంత దెయ్యంగా కనిపిస్తుంది. రేపు తనతో గదిని పంచుకోవాల్సిన అమ్మాయి... తెరపై దెయ్యంలా కనిపిస్తుంది అనే సరికి ‘నేను ఆ సినిమా చూడను’.. అని చెప్పేశాడు చైతూ’.. అంటూ తెగ నవ్వేశాడు నాగ్. ఇంకా చెబుతూ... ‘కాబోయే కోడలు దెయ్యంలా నటిస్తుంటే నేనే భరించలేకపోయాను. ఇక చైతూ ఎలా తట్టుకోగలడు చెప్పండి? అందుకే ‘నో’ చెప్పేశాడు. వాడి బాధ కూడా కరెక్టే కదా’ అన్నాడు నాగ్.
‘రాజుగారి గది2’లో నాగ్, సమంత కాంబినేషన్ సీన్లు టెర్రర్ పుట్టిస్తాయట. దాదాపు 15 నిమిషాలు సాగే ఆ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని తెలుస్తోంది. ఏదిఏమైనా... మామాకోడళ్లు ఇద్దరూ కలిసి వెండితెరను పంచుకోవడం నిజంగా గమ్మత్తుగా ఉంది. ఏమంటారు?