సల్మాన్ నుంచి మీరు ఆశించినా అది రాదు..!
on May 21, 2016
బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ సల్మాన్ ఖాన్. నార్త్ జనాల్లో, మాస్ లో సల్మాన్ కు ఉన్న ఫాలోయింగ్ ఇంకెవరికీ ఉండదంటే ఆశ్చర్యం లేదు. యావరేజ్ గానో, ఫ్లాప్ గానే ఆడితేనే సల్లూభాయ్ సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరిపోతుంటాయి. అంత క్రౌడ్ పుల్లింగ్ స్టామినా సల్మాన్ సొంతం. అయితే ఇంత సూపర్ స్టార్ డమ్ ఉన్న సల్మాన్ కు డ్యాన్స్ లు పెద్దగా రావు. ఏదో లైట్ గా మ్యానేజ్ చేయగలడు తప్ప, సీరియస్ గా మైకేల్ జాక్సన్ స్టెప్పులేయమంటే ఆయనతో కష్టమే. ఇదే విషయాన్ని సల్మాన్ కూడా ఒప్పేసుకోవడం విశేషం. జూన్ 23 నుంచి 26 వరకూ, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఉత్సవాలు జరగబోతున్నాయి. వీటిలో సల్లూ తో పాటు హృతిక్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ లాంటి సూపర్ డ్యాన్సర్లందరూ చిందేయబోతున్నారు. ఈ ఉత్సవాల్లో తన డ్యాన్స్ ను పెద్దగా ఎక్స్ పెక్ట్ చేయద్దంటూ సల్లూభాయ్ ముందుగానే ప్రేక్షకులకు చెప్పేశాడు. నా నుంచి హృతిక్ స్థాయి స్టెప్పులు కోరుకోవద్దు. ఏదో నాకొచ్చినట్టుగా రెండు మూడు నార్మల్ స్టెప్స్ వేస్తాను అంతే అంటూ క్లియర్ గా రిక్వెస్ట్ చేశాడు. రాకపోతే స్టేజ్ ఎక్కి ఇబ్బంది పడకుండా, ముందుగానే రాదని క్లియర్ గా ఒప్పేసుకోవడం మా వాడి గ్రేట్ నెస్ అంటూ గొప్ప చెప్పుకుంటున్నారు సల్లూభాయ్ ఫ్యాన్స్..