`సాహో` ప్రీ రిలీజ్ ఎక్కడో తెలుసా ??
on Aug 8, 2019
తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో రూపొందుతున్న హై బడ్జెట్ సినిమా `సాహో `. ఇప్పటికే ఈ సినిమా టీజర్స్ , సాంగ్స్ , పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఆగష్టు 30 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా లో మూవీ ప్రమోషన్ స్టార్ట్ అయ్యింది. ఇక రేపు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చెన్నై, కొచ్చి , ముంబై , బెంగళూరు ఇలా నాలుగు నగరాల్లో చిత్ర టీం పర్యటించనుందట . ఇదిలా ఉంటె .. సాహో సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ నెల 18న గ్రాండ్ గా చేయడానికి ప్లాన్ చేస్తుందట చిత్ర యూనిట్. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ టాలీవుడ్ , బాలీవుడ్ ప్రముఖుల మధ్య జరపడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. పెద్ద ఎత్తున ప్రభాస్ ఫాన్స్ పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Also Read