English | Telugu

నాలుగో స్థానంలో 'సాహో'

on Sep 8, 2019

 

ప్రభాస్ మూవీ 'సాహో' తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ మొదటి వారం మంచి కలెక్షన్స్ సాధించింది. 2019లో ఇప్పటివరకూ విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో తొలి వారం వసూళ్ల పరంగా 'సాహో' నాలుగో స్థానంలో నిలిచింది. 'సాహో' హిందీ వెర్షన్ 116.03 కోట్ల రూపాయలను (నెట్) వసూలు చేసిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. మొదటి వారం వసూళ్ల పరంగా సల్మాన్ ఖాన్ 'భారత్' మూవీ తొలి స్థానంలో, షాహిద్ కపూర్ మూవీ 'కబీర్ సింగ్' రెండో స్థానంలో, అక్షయ్ కుమార్ సినిమా 'మిషన్ మంగళ్' మూడో స్థానంలో నిలవగా, అక్షయ్ మరో సినిమా 'కేసరి' ఐదో స్థానాన్ని పొందింది. వీటిలో 'భారత్' బుధవారం విడుదలవగా, 'మిషన్ మంగళ్', 'కేసరి' సినిమాలు గురువారం విడుదలయ్యాయి. 'సాహో', 'కబీర్ సింగ్' సినిమాలు సంప్రదాయ ప్రకారంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇప్పటివరకూ 2019 టాప్ ఫైవ్ మూవీస్...

1. భారత్ - రూ. 180.05 కోట్లు (9 రోజులు)
2. కబీర్ సింగ్ - రూ. 134.42 కోట్లు
3. మిషన్ మంగళ్ - రూ. 128.16 కోట్లు (8 రొజులు)
4. సాహో - రూ. 116.03 కోట్లు 
5. కేసరి - రూ. 105.86 కోట్లు (8 రోజులు)


Cinema GalleriesLatest News


Video-Gossips