అర్ధం చేసుకోండి, నేను పవన్ కళ్యాణ్ భార్యని కాను: రేణు దేశాయ్
on Jul 1, 2017
.jpg)
హీరోలకంటే చాలా విషయాల్లో అభిమానుల హడావిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు అయితే, అది తారా స్థాయికి చేరుకుంటుంది. ఇంకొన్ని సార్లు అది అభిమానమో, రాక్షసత్వమో కూడా అర్ధం కాదు. అభిమానం పేరుతో, తమ అభిమాన నటుడికి నచ్చని వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక అసలు విషయానికి వస్తే, సోషల్ మీడియా లో ఇతర మాధ్యమాల ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులు పదే పదే అడుగుతున్న ప్రశ్నలకి విసిగిపోయిన ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విషయాల్లో మరొకసారి వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నాలుగు సంవత్సరాల క్రితం ఆనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని... వాళ్ళకి ఒక అందమైన పాప కూడా ఉందని...అందువల్ల పవన్ అభిమానులు తనని ఆయనతో మళ్ళీ ఏకం కావాలని కోరుకోవడం తప్పు అని... పవన్ కి భార్య తాను కాదని, ఆనా అని వాళ్ళు తెలుసుకోవాలని... అన్నది. అయితే, పవన్ తన పిల్లలకి తండ్రి అని... తనకి మాత్రం ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని... వివరణ ఇచ్చింది. రేణు దేశాయ్ ఫేస్బుక్ లో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినా కొందరు తమ ధోరణిని మార్చుకోవడం లేదు. కొందరు నువ్వే ఎప్పటికీ మా వదినవాని చెప్పగా... మీరు ఎంత బాధతో ఈ విషయం చెప్పారో అర్ధం చేసుకోగలం అని మరి కొందరు అంటూ విషయాన్నీ మళ్ళీ మొదటికి తెచ్చారు. ఇకనయినా రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ విషయంలో విసిగించడం మానేస్తే ఆమె తమ పిల్లల విషయంలో ఏ టెన్షన్ లేకుండా శ్రద్ధ తీసుకోగలదు, లేదంటే మనశాంతి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది అందరూ అర్ధం చేసుకుంటారని ఆశిద్దాం!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



