రామ్ చరణ్ ప్రొడక్షన్ కంపెనీ లోగో ఇదే..!
on Apr 29, 2016

చాలా కాలంగా మెగాభిమానులు ఎదురుచూస్తున్న చిరు 150 సినిమాను రామ్ చరణ్ తన సొంత నిర్మాణంలో చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమకు అంజనా ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ లాంటి సొంత సంస్థలు ఉన్నా, కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించడానికి మొగ్గు చూపాడు చరణ్. ఈ కొత్త బ్యానర్ కు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అని పేరు పెట్టారు. ఈరోజే ఈ బ్యానర్ లోగోను రిలీజ్ చేశారు మూవీ టీం. ఆరెంజ్ కలర్ లో హనుమంతుడి ముఖాన్ని బ్యానర్ కు లోగోగా డిజైన్ చేశారు చరణ్ అండ్ కో. ఈ రోజు సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య చిరు 150 వ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. ప్రస్తుతానికి సినిమాకు కత్తిలాంటోడు అనే టైటిల్ ను అనుకుంటున్నా, సినిమా ప్రారంభమైన తర్వాత టైటిల్ ను మార్చే యోచనలో ఉన్నాడు డైరెక్టర్ వినాయక్. జూన్ లో షూటింగ్ మొదలెట్టి, 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది మూవీ టీం ఆలోచన. హీరోయిన్ తో సహా టోటల్ క్యాస్టింగ్ ను త్వరలోనే ఫైనలైజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రోబో, కుమారి 21f సినిమాలకు చేసిన రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



