మరో మెగాహీరో మూవీ స్టార్ట్..!
on Apr 28, 2016

ఓ పక్క తన శ్రీరస్తు శుభమస్తు సినిమా రిలీజ్ కు రెడీ చేస్తూనే మరో వైపు కొత్త సినిమాను మొదలెడుతున్నాడు అల్లు వారి చిన్నబ్బాయి శిరీష్. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో శిరీష్ మూవీ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, శ్రీను వైట్ల కెమేరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ డైరెక్టర్ మారుతి గౌరవ దర్శకత్వం చేశారు. ఏడాది కాలంగా 20 కథలు వింటే, ఆఖరికి నచ్చిన కథ ఇది అని అల్లు శిరీష్ అన్నారు. యాక్షన్, కామెడీ లాంటి అన్ని అంశాలు పూర్తిగా ఉన్న కథ ఇదని, ఈ స్టోరీ కోసమే చాలా కాలంగా ఎదురుచూస్తున్నానన్నారు శిరీష్. దాదాపు ఏడు వందల ఏళ్ల క్రితం జరిగిన డ్రామాకు, ప్రస్తుతం కాలంలో జరిగే కథతో సంబంధం ఉంటూ సాగే లవ్ స్టోరీ అని డైరెక్టర్ తెలిపారు. శ్రీరస్తు శుభమస్తు పూర్తైన తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



