'మహర్షి' డైరెక్టర్‌కు చరణ్ గ్రీన్ సిగ్నల్!
on Jul 11, 2020
డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎట్టకేలకు తన కథతో ఓ స్టార్ హీరోను కన్విన్స్ చేశాడు. అతను డైరెక్ట్ చేసే తర్వాతి సినిమాలో రామ్‌చరణ్ హీరోగా నటించనున్నాడు. ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో ఇదో పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత వంశీ డైరెక్షన్‌లో చేయాలనుకున్నాడు సూపర్‌స్టార్ మహేశ్. అయితే వంశీ చెప్పిన ఫైనల్ స్క్రిప్ట్ అతనికి నచ్చలేదు. దానికి బదులుగా పరశురామ్ 'సర్కారువారి పాట' స్క్రిప్టుకు అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో ఖంగుతిన్న వంశీ కొంతమంది స్టార్స్‌ను సంప్రదించాడు. అయితే డేట్స్ ప్రాబ్లెమ్ వల్ల వాళ్లెవరూ అతనితో పనిచేయడానికి ముందుకు రాలేదు.
దాంతో అతను లాభం లేదనుకొని ఆ స్క్రిప్టును పక్కనపెట్టి, లాక్‌డౌన్ కాలంలో మరో స్క్రిప్టు రాసుకున్నాడు. దాన్నితన 'ఎవడు' హీరో రామ్‌చరణ్‌కు వినిపించాడు. 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత చేసే సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తోన్న చరణ్‌కు అది బాగా నచ్చిందనీ, అందుకు ఓకే చెప్పాడనీ వినిపిస్తోంది. అన్నీ అనుకూలిస్తే, 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత వంశీ డైరెక్షన్‌లో చరణ్ నటించే అవకాశాలున్నాయి. ఈలోగా ఫాదర్ చిరంజీవితో తను నిర్మిస్తోన్న 'ఆచార్య' సినిమాలోని కీలక పాత్రను కూడా అతను చేయనున్నాడు. ఏదేమైనా 'మహర్షి' వంటి కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ సినిమా తర్వాత ఖాళీగా ఉన్న వంశీ పైడిపల్లికి ఊరట లభించినట్లే అంటున్నారు ఫిల్మ్‌నగర్ జనాలు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
