రేణు దేశాయ్ 'పెళ్లి గోల‘
on Jul 11, 2020
రేణు దేశాయ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. తెలుగులో 'బద్రి', 'జానీ' సినిమాల్లో కథానాయికగా నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు కొన్నిటికి కాస్ట్యూమ్ డిజైనర్, ఎడిటర్ గా వర్క్ చేశారు. మరాఠీ సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ కూడా చేశారు. అయితే... తెలుగు సినిమా ప్రేక్షకుల్లో చాలామంది ఆమెను పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే చూస్తున్నారు. ఇది రేణు దేశాయ్ కి చికాకు తెప్పించే అంశమే. కానీ పవన్ ఎక్స్ వైఫ్ ట్యాగ్ భరించక తప్పడం లేదు.
పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు రేణుదేశాయ్ ఒంటరిగా ఉన్నారు. తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు, నిశ్చితార్థం జరిగినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమె నిర్ణయంపై పవన్ అభిమానులు కొంతమంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రోల్స్ వచ్చాయి. తర్వాత ఏమైందో తెలియదు... రేణు దేశాయ్ ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకు రాలేదు. మళ్లీ ఆమె పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది చాలామందిలో ఉన్న సందేహం. తాజాగా ఈ సందేహాలపై రేణుదేశాయ్ స్పందించారు.
"ఎందుకో తెలియదు చాలా మందికి నా మారిటల్ స్టేటస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నా పెళ్లి సమస్యలపై ఓ సినిమా తీయడానికి ట్రై చేస్తా. దానికి 'పెళ్లిగోల' అని టైటిల్ పెడతా" అని రేణుదేశాయ్ సరదాగా వ్యాఖ్యానించారు. నిజంగా సినిమా తీస్తే మాత్రం ఇది బంపర్ హిట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.