రకుల్ కాంతి ముందు సూర్యుడు సైతం చిన్నబోతున్నాడు!
on Nov 21, 2020
ఒకవైపు టాలీవుడ్, మరోవైపు బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిన ఫిట్‌నెస్ క్వీన్ రకుల్‌ప్రీత్ సింగ్ తాజాగా మాల్దీవుల్లో సెలవుల్ని సూపర్‌గా ఎంజాయ్ చేస్తోంది. ఆమెకు అమ్మానాన్ను, తమ్ముడు అమన్‌ప్రీత్ కూడా తోడయ్యారు. రెండు రోజుల క్రితం అక్కడకు వెళ్లిన 30 సంవత్సరాల రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అక్కడి అందమైన మూమెంట్స్‌ను షేర్ చేస్తూ, ఫ్యాన్స్‌ను అలరిస్తూ వస్తోంది.
శనివారం ఉదయం ఆరంజ్ కలర్ టు-పీస్ బికినీ ధరించి, ఎండలో కూర్చొని కెమెరాకు పోజిచ్చింది. ఆ పిక్చర్‌ను తీసింది ఆమె డాడీయే! ఆ ఫొటోను షేర్ చేసిన రకుల్, "Smiles are contagious, be a carrier. Moments captured by daddy the great." అంటూ రాసుకొచ్చింది.
దానికి ముందు ఫిట్నెస్ ఫ్రీక్ అయిన ఆమె ఎక్కడకు వెళ్లిన వర్కవుట్స్ మాననని స్పష్టం చేసే ఓ ఫొటోను షేర్ చేసింది. సేమ్ ఆరంజ్ బికినీలో ఇసుకలో ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఆ ఫొటోతో పాటు, "And getting my dose of vitamin D by the sea." అనే క్యాప్షన్, #nevermissaworkout #vacayvibes అనే హ్యాష్‌ట్యాగ్స్ పెట్టింది. ఈ పిక్చర్స్‌లో రకుల్‌ని చూసిన ఫ్యాన్స్ ఆమె వెలుగు ముందు సూర్యుడు కూడా చిన్నబోతున్నట్లుగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
