బర్త్‌డే బేబీ అర్హను రేసుగుర్రంపై కూర్చోబెట్టిన బన్నీ!
on Nov 21, 2020

అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతుల గారాలపట్టి అర్హ నాలుగో పుట్టినరోజు వేడుకలు అల్లు వారింట ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ వయసుకే తన చిలిపి చేష్టలతో, ముద్దు ముద్దు మాటలతో ఫ్యాన్స్‌ను అలరిస్తూ వస్తోంది ఈ చిన్నారి. బర్త్‌డే సందర్భంగా తన ముద్దుల తనయను ఈరోజు ఉదయమే సర్‌ప్రైజ్ చేశాడు బన్నీ. నిజమైన రేసుగుర్రంపై అర్హను కూర్చోపెట్టి అటూ ఇటూ నడిపించాడు. ఈ అనుభవానికి అర్హ థ్రిల్ ఫీలయ్యింది. దీనికి సంబంధించిన పిక్చర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు బన్నీ. "Small Surprise in the morning for the bday baby" అంటూ దానికి క్యాప్షన్ జోడించాడు.
దానికి ముందు కూతురికి బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. అర్హ చేతుల్లో బర్త్‌డే గిఫ్ట్‌ను పెట్టి, ఆమె హ్యాపీగా నవ్వుతున్న ఫొటోను షేర్ చేసిన బన్నీ, "Many many happy returns of the day to my Arha . Thank you for the infinite cuteness n joi that you give me . Wishing you a wonderful birthday my little angel . #alluarha" అని రాసుకొచ్చాడు.
.jpg)
కూతురి వల్ల తన జీవితానికి ఎంతటి ఆనందం చేకూరిందో ఆ పోస్ట్ ద్వారా వ్యక్తం చేశాడు బన్నీ. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో 'పుష్ప' షూటింగ్‌లో పాల్గొంటున్న బన్నీ, కూతురి బర్త్‌డేని జరపడానికి హైదరాబాద్ వచ్చాడు. అర్హతో హ్యాపీ మూమెంట్స్‌ను పంచుకున్నాడు. తన బర్త్‌డేకి నాన్న రాకతో అర్హ కూడా మురిసిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



