English | Telugu

‘రాజుగారి గది2’ లో నాగ్ సీన్లే ఎడిట్ చేశారు!

on Oct 12, 2017

రాజుగారి గది2 సినిమా శుక్రవారం విడుదల కానుంది కదా. ఈ సినిమా విషయంలో ఆసక్తికరమైన విషయాలు జరిగాయ్. అదేంటంటే... నాగార్జున ఇందులో ప్రధాన భూమిక పోషించాడు కాబట్టి.. కథతో నిమిత్తం లేకుండా... ఆయన ఇమేజ్ కి తగ్గ కొన్ని సన్నివేశాలను దర్శకుడు ఓం కార్ చిత్రీకరించాడట. సినిమా పూర్తయ్యాక... రషస్ చూద్దామని యూనిట్ ముందు సినిమా వేశారట. తీరా సినిమా చూస్తే... నాగార్జున ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తీసిన సీన్లన్నీ అతికించినట్లుగా అనిపించాయట. దాంతో దర్శకుడు ఓంకార్.. నాగ్ తో నిర్మొహమాటంగా చెప్పేశాడట..

‘సార్.. కథకు సంబంధం లేకుండా ఆ సీన్లు పెట్టడం నచ్చలేదండి. ఏదో అతికించినట్లు అనిపిస్తున్నాయ్. తీసేద్దాం’ అనేశాడట. నాగ్ కూడా ‘ఓకే’ చెప్పేయడంతో నాగార్జునకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఎడిట్ చేసేశారు. ఆ తర్వాత మళ్లీ సినిమా చూశారు. ఈ దఫా నాగార్జునకు సందేహం మొదలైందట. ‘నా మార్క్ అస్సలు కనిపించడం లేదు. అది సినిమాకు దెబ్బ. ఆలోచించుకో’ అని చెప్పేశాడట. దాంతో.. మళ్లీ నాగార్జునతో ఓ సీన్ ని చిత్రీకరించారట. ఆ సన్నివేశం సందేశాత్మకంగా సాగే విధంగా ఉంటుందని తెలిసింది. టోటల్ అవుట్ పుట్ చూశాక.. నాగార్జునతో చివరిగా తీసిన సన్నివేశం హైలైట్ గా కనిపించిందని అందరూ అనుకుంటున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత కీలక పాత్ర పోషించింది. ఓ మలయాళం చిత్రం ఆదారంగా రూపొందిన ఈ చిత్రం .. శుక్రవారం విడుదల కానుంది.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here