రజనీ సినిమాలో నీలాంబరి ఉందా..?
on Jun 7, 2016

నరసింహ సినిమాలో రజనీ రమ్యకృష్ణ కాంబినేషన్ సీన్స్ అప్పట్లో ఒక సంచలనం. ఆ సినిమా తర్వాత మళ్లీ రజనీ రమ్య కాంబినేషన్ రాలేదు. అయితే తాజాగా రజనీ నటిస్తున్న రోబో 2.0లో మళ్లీ ఆ కాంబో రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించబోతుందంటున్నాయి మూవీ వర్గాలు. బాహుబలిలో శివగామిగా రమ్యకృష్ణ కనబర్చిన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో రజనీకి, రమ్యకు మధ్య ఎలాంటి సీన్స్ రాబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కూడా ఆమె నెగటివ్ రోల్ పోషిస్తోందని, రజనీని సవాల్ చేసే పాత్రతో ఆమె మెప్పించనుందని అంటున్నారు. ఇప్పటి వరకూ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే లేనంత భారీగా, 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది రోబో 2.0. ఐ లాంటి డిజాస్టర్ తీసిన శంకర్, ఈ సినిమాతో మళ్లీ ఫామ్ అందుకోవాలనుకుంటున్నాడు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఈ సినిమాలో విలన్ గా చేయడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



