రజనీ ' కబాలీ ' అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజైంది..!
on Apr 30, 2016

చాలా కాలంగా ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా ఉన్న సూపర్ స్టార్ రజనీ ఫ్యాన్స్ కు ఈరోజు, రేపు రజనీ నుంచి బహుమతులు రెడీగా ఉన్నాయి. పా రంజిత్ దర్శకత్వంలో రజనీ కబాలీ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఒక థ్రిల్లింగ్ లుక్ ను ఈ రోజు మూవీ టీం రిలీజ్ చేశారు. అంత కంటే స్పెషల్ గా, రేపు కబాలీ టీజర్ ను విడుదల చేయబోతున్నారు రజనీ అండ్ కో. టీజర్ కు సంబంధించిన ఫోటోనే ఫస్ట్ లుక్ గా కూడా రిలీజ్ చేశారని సమాచారం. ఇప్పటికే మూవీ షూటింగ్ టైం లో తీసిన ఫోటోలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. మే 1న కబాలీ టీం అఫీషియల్ గా రిలీజ్ చేసే టీజర్ ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కబాలీ ఒక స్టైలిష్ డాన్ కథ. ఇది బాషా 2 అని చాలా మంది అంటున్నప్పటికీ, మూవీ టీం నోరు మెదపట్లేదు. రజనీకి జంటగా రాధికా ఆప్టే నటించింది. ఈ భారీ బడ్జెట్ మూవీని కలైపులి ఎస్ థాను ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



