అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న కమల్ కూతురు..!
on Apr 30, 2016

కమల్ హాసన్ అంటే వైవిధ్యం. లోకనాయకుడని, సకలకళావల్లభుడని కమల్ కు పేరుంది. ఆయన కూతుళ్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఏదో ఒక రంగానికే పరిమితమైపోకుండా, అన్ని రంగాల్లోనూ ఒక అడుగు పెట్టడం తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది కమల్ ఇద్దరి కూతుళ్లకి. ఇప్పటికే శృతి హాసన్ సింగర్ గా, నటిగా తనలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించుకుంది. ఇప్పుడు కమల్ చిన్న కూతురు అక్షర వంతొచ్చింది. నటిగా షమితాబ్ లో ఫర్లేదనిపించుకున్న అక్షర, కమల్ లేటెస్ట్ సినిమా శభాష్ నాయుడుకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయబోతోంది. ఈ సినిమా డైరెక్టర్ రాజీవ్ కుమార్ కు అసిస్టెంట్ గా అక్షర జాయిన్ అయింది. అంటే కమల్ తన ప్రొఫెషన్ లో తొలిసారి ఇద్దరు కూతుళ్లతో కలిసి వర్క్ చేయబోతున్నారనమాట. మల్టీ ట్యాలెంట్ చూపించడంలో తండ్రికి ఏ మాత్రం తగ్గరని నిరూపించుకుంటున్నారు శృతి, అక్షర. శభాష్ నాయుడు మే 16 నుంచి షూటింగ్ మొదలెట్టనుంది. చాలా కాలం తర్వాత కమల్ ఇళయరాజా కాంబోలో వస్తున్న సినిమా కావడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



