తెలుగు మహాసభల్లో అర్జున్ రెడ్డి హవా..!!
on Dec 19, 2017
అర్జున్‌రెడ్డితో తెలుగునాట ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు అర్జున్‌రెడ్డి. సారీ.. సారీ విజయ్ దేవరకొండ. ప్రతి ఒక్కరికి ఇదే కన్ఫ్యూజన్ మనోడి అసలు పేరును మరిచిపోయి.. చిన్నా, పెద్దా అంతా అర్జున్‌రెడ్డి.. అర్జున్‌రెడ్డి అంటూ కలవరిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు రెండు రాష్ట్రాలకు రిప్రజంట్ చేస్తున్నట్లు భావించాలి. కానీ తమ ప్రాంతానికి చెందిన వాడు ఇంత పాపులారిటీ సంపాదించడంతో.. తెలంగాణ జనం విజయ్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటడంతో పాటు మాతృభాషను కాపాడుకునే ఉద్దేశ్యంతో.. ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ సభల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా వివిధ కార్యక్రమాలను రూపొందించింది. అలాగే సినీ ప్రముఖులతో కొన్ని పాటలను కూడా తీసింది. దీనిలో భాగంగా తెలంగాణ చరిత్ర, పండుగలు, వారసత్వాన్ని ప్రతిబింబించేలా చిత్రీకరించిన ప్రత్యేక గీతంలో విజయ్‌దేవర కొండ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాటలో విజయ్‌తో హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఆడిపాడారు.