ఆర్టీఏ ఆఫీసులో ప్రత్యక్షమైన ప్రభాస్!
on Aug 7, 2020
నాలుగు నెలల కాలం పైనుంచే సినీ స్టార్లెవరూ బయట కనిపించడం లేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధంలో భాగంగా అమల్లోకి వచ్చిన నిబంధనలతో పాటు ఇంట్లో ఉండండి.. క్షేమంగా ఉండండి అనే స్లోగన్ కూడా దీనికి కారణం. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌కు కూడా ఇది వర్తిస్తుంది. అలాంటిది అతను బయటకు వచ్చాడంటే.. అందునా జనంలోకి వచ్చాడంటే వాళ్లకు ఎంత సంబరం! అదే అనుభవంలోకి వచ్చింది ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన వాళ్లతో పాటు, అక్కడి సిబ్బందికి కూడా. తమ అభిమాన పాన్ ఇండియా స్టార్‌ను చూడగానే ఒక్కసారిగా సంభ్రమం చెందిన వాళ్లంతా తమ సెల్ఫోన్లకు పని కల్పించి అతడిని ఫొటోలు తీయడానికి ఎగబడ్డారు.
లాక్డౌన్ కాలం నుంచీ ఎప్పుడు బయటకు వచ్చినా మాస్క్ వాడటమనే కనీస నిబంధనను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తోన్న ప్రభాస్.. ఇప్పుడు కూడా మాస్క్ ధరించి పర్సనల్ వర్క్ మీద ఆర్టీఏ ఆఫీసుకు వచ్చాడు. బ్లాక్ షర్ట్, వైట్ అండ్ బ్లూ కలనేత ట్రౌజర్ ధరించాడు. షూటింగ్ లేకపోయినా, ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వస్తున్నా బరువు పెరగకుండా చూసుకుంటున్నాడని అతడి ఫిజిక్ చూస్తే అర్థమైపోతోంది. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో రాధే శ్యామ్ మూవీ చేస్తున్నాడు.