శృతి హాసన్ ఇవ్వబోయే సర్ప్రైజ్ అదే!
on Aug 7, 2020
శృతి హాసన్ హీరోయిన్ మాత్రమే కాదు... ఆమెలో సంగీత కళాకారిణి కూడా ఉన్న సంగతి తెలిసిందే. శృతి మంచి సింగర్. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్ కూడా! తండ్రి కమల్ నటించిన 'ఈనాడు'కి ఓ పాట కంపోజ్ చేసి ఇచ్చారు. లేటెస్టుగా లాక్డౌన్లో కొత్త మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయడం మీద కాన్సంట్రేట్ చేశారు. కొన్ని రోజులుగా ఈ నెల 8న ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఉందని శృతి హాసన్ అభిమానులు, ప్రేక్షకులను ఊరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సర్ప్రైజ్ ఏంటంటే... కొత్త సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు.
'ఎడ్జ్' పేరుతో శనివారం శృతి హాసన్ ఒక ఒరిజినల్ ట్రాక్ (సాంగ్) రిలీజ్ చేయనున్నారు. మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలనే థీమ్‌తో ఈ సాంగ్ రూపొందించారట. ఈ పాటను శృతి హాసన్ రాయడంతో పాటు పాడారు. సిద్ధీ పటేల్‌తో కలిసి వీడియో షూట్ చేశారు. అందులో ఆమె నటించారు. ఈ సాంగ్ కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.