పాయల్ చెంతకే చేరిన ఆ ఐటమ్ సాంగ్?
on Jan 25, 2021
ఆర్ ఎక్స్ 100తో దర్శకుడిగా తొలి అడుగేసిన అజయ్ భూపతి.. మొదటి సినిమాతోనే సంచలన విజయం నమోదు చేసుకున్నారు. తొలి చిత్రం బ్లాక్ బస్టర్ అయినా.. రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులేశారు. రకరకాల మలుపులతో సాగి ఎట్టకేలకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అదే.. మహాసముద్రం. శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతానికి స్థానముందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ ఐటమ్ నంబర్ కోసం ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ని ఎంచుకున్నారని కథనాలు వచ్చాయి. ఆ తరువాత మన్నారా చోప్రా పేరు వినిపించింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇప్పుడా అవకాశం చివరాఖరికి పాయల్ చెంతకే చేరిందని టాక్. త్వరలోనే మహాసముద్రంలో పాయల్ స్పెషల్ సాంగ్ పై క్లారిటీ వస్తుంది.
ఈ ఏడాదిలోనే మహాసముద్రం థియేటర్స్ లో సందడి చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
