దిల్ రాజును ఆకాశానికెత్తేసిన పవర్‌స్టార్!
on Apr 5, 2021
"తెలుగు చిత్ర పరిశ్రమలో మహోన్నత స్థానానికి వెళ్లిన నిర్మాత దిల్ రాజు నాతో సినిమా చేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను... విజయం ఎక్కడ ఉందో తెలుసుకోగల వ్యక్తి దిల్ రాజు. సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ అలాంటిది." అంటూ ఆయనను ఆకాశానికెత్తేశారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ 'వకీల్ సాబ్'ను నిర్మించింది దిల్ రాజు. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆదివారం రాత్రి జరిగిన 'వకీల్ సాబ్' ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన పవన్ కల్యాణ్ తన నిర్మాత గురించి ప్రత్యేకంగా కొన్ని మాటలు మాట్లాడారు.
"తెలుగు చిత్ర పరిశ్రమలో మహోన్నత స్థానానికి వెళ్లిన నిర్మాత దిల్ రాజు నాతో సినిమా చేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే.. నేనెప్పుడూ కలలు కనే వారిని ఇష్టపడతాను. ఏదైనా సరే ఒక కల కనాలి. నేను ఇది సాధిస్తాను, నేను ఈ స్థాయికి వెళ్తాను అని కలలు గనే వారంటే నాకు ఇష్టం. గుంటూరు శేషేంద్ర శర్మ అన్నట్లు "కలలు కను కలలు కను కలలు కను.. నీ కలల్ని తొక్కేస్తున్న పాదాల్ని ఖండించే వరకు కలలు కను" అనే మాటలు నాకు చాలా ఇష్టం. దిల్ రాజు గారు ఎన్నో కలలుగన్నారు." అని చెప్పారు పవన్ కల్యాణ్.
'తొలి ప్రేమ' షూటింగ్ టైమ్ లో దిల్ రాజును ఆ చిత్ర నిర్మాత జీవీజీ రాజు తీసుకొచ్చి పరిచయం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు పీకే. "ఇంకా అప్పటికి 'తొలి ప్రేమ' ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశాం. ఆ పోస్టర్ చూసి నేను సినిమా కొంటానని దిల్ రాజు గారు రావడం ఆశ్చర్యమేసింది. ఆయనకు సినిమా పట్ల ఒక సెన్స్ ఉందని అనిపించింది. విజయం ఎక్కడ ఉందో తెలుసుకోగల వ్యక్తి దిల్ రాజు. సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ అలాంటిది. దిల్ రాజు గారు చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అన్ని విషయాలు తెలుసుకున్నారు. నా కెరీర్ లో మొదటి నుంచి దిల్ రాజు పాత్ర పోషించారు. చాలా సూపర్ హిట్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. మా మధ్య ఎందుకో గానీ సినిమా చేయాలని డిస్కషన్ రాలేదు. కానీ 'వకీల్ సాబ్' సినిమాలో నటించాక.. ఇలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ తో ఇంకా ముందుగానే సినిమా చేసి ఉండాల్సింది అనిపించింది. ఈ మాట మనస్ఫూర్తిగా చెబుతున్నాను." అని చెప్పుకొచ్చారు పవర్‌స్టార్.
Also Read