ఎన్టీఆర్ హీరోయిన్ మళ్ళీ వస్తానంటోంది
on Jan 10, 2020
మనతో ఎవరైనా 'మళ్ళీ వస్తాను' లేదా 'వెళ్ళొస్తాను' అంటే అర్థం ఏమిటి? ప్రస్తుతం మన దగ్గర నుండి వెళ్తున్నారనే కదా! 'టాటా బై బై' చెబుతున్నారనే కదా! 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ హీరోయిన్, విదేశీ భామ ఒలీవియా మోరిస్ కూడా ఇప్పుడు భారతీయ ప్రేక్షకులకు, ఇండియాకి 'టాటా బై బై' చెప్పారు. కొత్త ఏడాది ప్రారంభంలో ఆమె ఇండియాకి వచ్చారు. కొన్ని రోజులు షూటింగ్ చేశారు. ప్రజెంట్ షెడ్యూల్ లో తన పాత్రకు సంబంధిచిన చిత్రీకరణ పూర్తి కావడంతో విదేశాలు వెళ్లారు.
"ప్రస్తుతానికి ఇండియాకి బై. అతి త్వరలో మళ్ళీ వస్తాను. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ఎక్కువ చేస్తాను" అని ఒలీవియా మోరిస్ పేర్కొన్నారు. 'ఆర్ఆర్ఆర్' హీరోయిన్‌కి స్మాల్ బ్రేక్ వచ్చిందన్నమాట. టోటల్ యూనిట్ కి కూడా సంక్రాంతి సందర్భంగా స్మాల్ బ్రేక్ ఇవ్వాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జులై నెలాఖరున సినిమా విడుదల కానుంది.
Also Read