తెలుగుతెరపై తిరుగులేని మొనగాడు తారకరాముడు..!
on May 28, 2016
రాముడు ఎలా ఉంటాడో మనం చూడలేదు. కృష్ణుడి కొంటె చేష్టలు మనం చూడలేదు. కానీ ఆ దేవుళ్లను గుర్తు చేసుకున్నప్పుడు తప్పకుండా గుర్తొచ్చే పేరు మాత్రం ఆయనదే. రాముడుగా ప్రశాంతతగా కనిపించే ఆ ముఖంలోనే, ధుర్యోధనుడి క్రౌర్యం భయపెడుతుంది. కృష్ణుడిగా చిలిపిచేష్టలు చేసే అదే ప్రసన్న వదనం, భీముడిగా రౌద్రాన్ని ప్రదర్శిస్తుంది. తేజస్సు ఉట్టిపడే ఆయన తెలుగువారి దృష్టిలో కారణ జన్ముడు. తెలుగుజాతికి ఆదర్శప్రాయుడు. ఎంత చూసినా తనివితీరనిది ఆయన నిండైన విగ్రహం. ఏ పాత్ర అయినా ఆయనకు కొట్టిన పిండే. పాత్రను తెలుసుకుని నటించే వాళ్లు నటులౌతారు. కానీ పాత్రకే గుర్తింపు తీసుకొచ్చి కొత్తగా ఆవిష్కరించేవాళ్లు దిగ్గజాలౌతారు. తెలుగునేలకు రాముడు, కృష్ణుడు, భీముడు, భీష్ముడు, కర్ణుడు, అన్నీ ఆయనే. ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి పేరు నందమూరి తారకరామారావు. ఈ రోజు ఆయన జయంతి. ఆయన నటించిన లెక్కలేనన్ని సినిమాల్లో, ప్రేక్షకులపై ముద్ర వేసిన కొన్ని పౌరాణిక పాత్రల్ని ఎంచడం సాహసమే అయినా, మచ్చుకు కొన్ని చూసే ప్రయత్నం చేద్దాం.
1. రాముడు
2. కృష్ణుడు
3. ధుర్యోధనుడు
4. కర్ణుడు
5. భీష్ముడు
6. భీముడు
7. శివుడు
8. రావణుడు

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
