బాలయ్యకు ఇంకా ఆమె దొరకలేదా...?
on May 28, 2016
.jpg)
బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా తన వందో సినిమా అద్భుతంగా ఉండాలని ఇప్పటికే బాలయ్య క్లియర్ గా స్పష్టం చేసేశారట. కేవలం మొరాకోలోని జరిగిన మొదటి షెడ్యూల్ కోసమే 8 కోట్లు ఖర్చవడం విశేషం. సినిమాకు చాలా కీలకమైన యుద్ధ సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసేసిన మూవీ టీం త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ కు షిఫ్ట్ అవబోతున్నారు. అయితే శాతకర్ణికి ఒక సమస్య మాత్రం తీరడం లేదు. ఇప్పటి వరకే చాలా మంది హీరోయిన్లనే చూసినా, ఎవరూ కూడా శాతకర్ణి సరసన సెట్ అవట్లేదు. నయనతార, అనుష్క, ఇలియానా అంటూ చాలా పేర్లే వినబడినా, ఇంకా ఎవరూ ఓకే అవ్వలేదని, అందరితోనూ డేట్స్ అడ్జస్ట్ మెంట్ ఇబ్బందిగా మారిందని సమాచారం. బాలయ్య ల్యాండ్ మార్క్ సినిమాలో నటించే అవకాశం ఎవరికి వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారీ సినిమా కావడంతో బల్క్ డేట్స్ అవసరం అవసరమని అందుకే హీరోయిన్ దొరకడం కష్టంగా మారిందని అంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే వారంలో హీరోయిన్ ను ఫైనల్ చేసేసి షూట్ కంటిన్యూ చేయాలని మూవీ టీం ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే హేమమాలిని శాతకర్ణి తల్లి పాత్రకు తీసుకున్న సంగతి తెలిసిందే. 2017 సంక్రాంతి సీజన్లో తెలుగుతెరపై దాడి చేయబోతున్నాడు శాతకర్ణి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



