English | Telugu

బాలకృష్ణ కాదు... ఎన్టీఆర్ గా శర్వానంద్...

on Mar 6, 2018

 

ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఇప్పటివరకూ ఎన్నో వార్తలు, ఎన్నో పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో న్యూస్ చక్కర్ల కొడుతుంది. తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర తెరకెక్కబోతుంది. తాజాగా చిత్ర డేట్లను కూడా బాలయ్య అనౌన్స్‌ చేశాడు. ఇక ఈసినిమాలో ఎన్‌టీఆర్ జీవితంలోని మూడు దశలను చూపించనున్నారు. ఇందులో భాగంగానే యంగ్ ఎన్టీఆర్ పాత్ర  హీరో శర్వానంద్‌  పోషించబోతున్నట్లుగా టాక్స్ వినిపిస్తున్నాయి. బాలయ్యకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక నిర్మాత ఇటీవలే శర్వానంద్‌తో ఈ ప్రాజెక్ట్‌ విషయమై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. మొదటి 20 నిమిషాల పాటు ఎన్టీఆర్‌ సినిమాల్లోకి రాక ముందు ఏం చేశాడు, వచ్చిన కొత్తలో ఎలా జరిగిందనే విషయాలను చూపించబోతున్నారట. ఆ సన్నివేశాలకు గాను ఎన్టీఆర్‌ పాత్రలో శర్వానంద్‌ కనిపించబోతున్నాడట. ఇక అంతటి గొప్ప వ్యక్తి  బయోపిక్ అవకాశం వచ్చినందుకు శర్వానంద్ కూడా వెంటనే ఒప్పుకున్నాడట. అయితే ఇందులో ఎంత నిజమున్నదో తెలియదు.. మరోపక్క ఇప్పటివరకూ ఎవరిని ఫైనలైజ్ చేయలేదని చెబుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కాగా జూన్‌ లేదా జులైలో చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించి 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ‘ఎన్టీఆర్‌’ను తీసుకు రాబోతున్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here