భరత్ అనే నేను బిజినెస్ లో అందుకే వేలు పెడుతున్నాడు
on Mar 6, 2018
.jpg)
ఒక దర్శకుడి పని ఏంటి, సినిమా కంప్లీట్ చేయడం... తరవాత టీంతో కలిసి ప్రమోట్ చేయడం. అయితే, పాపులర్ డైరెక్టర్ కొరటాల శివ భరత్ అనే నేను బిజినెస్ విషయంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడట. స్టార్ అయి ఉండి మహేష్ బాబు కూడా తన పని తాను చేసుకుంటూ పోతుంటే, శివ మాత్రం తానే స్వయంగా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి డీల్ క్లోజ్ చేస్తున్నాడట. కొన్ని ఏరియా ల్లో బయ్యర్లు కాస్త తక్కువ రేటుకి అడిగితే ఇచ్చేది లేదు అని తెగేసి చెబుతున్నాడట. ఇంతకీ, శివ పర్సనల్ ఇంటరెస్ట్ ఏంటనే కదా మీ డౌట్. భరత్ అనే నేను సినిమాకి గాను కొరటాల రెమ్యూనరేషన్ ఏం తీసుకోవట్లేదు అని టాక్. రిలీజ్ తరవాత వచ్చిన లాభాల్లో పెద్ద షేర్ తీసుకుంటాడట. సో, బిజినెస్ బాగా జరిగితే, తనకూ లాభమే కదా. మహేష్ బాబు ప్రస్తుత రికార్డు అంతగా బాలేకపోయినా, కొరటాల ట్రాక్ రికార్డు ని నమ్మి డిస్ట్రిబ్యూటర్ లు అధిక మొత్తం లో వెచ్చించడానికి ముందుకొస్తున్నారట. భరత్ అనే నేను ఏప్రిల్ 20 న విడుదలకి సిద్దమవుతున్న విషయం మనకు తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



