English | Telugu

‘బాహుబలి’ ఫార్ములాతో ‘యన్‌.టి.ఆర్‌’.

on Jan 5, 2019

 
కల్పిత కథతో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి’. నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కిన సినిమా ‘యన్‌.టి.ఆర్‌’. రాతలో... తీతలో... రెండు సినిమాల మధ్య పోలిక లేదు. కానీ, రెండు విషయాల్లో మాత్రం రెండిటి మధ్య పోలిక ఉంది. ఒకటి... విడుదల! రెండు... పబ్లిసిటీ. సినిమా ప్రచార విషయంలో, విడుదల విషయంలో ‘బాహుబలి’ని ‘యన్‌.టి.ఆర్‌’ ఫాలో అవుతుంది. ఓ సినిమాగా తీయాలని ‘బాహుబలి’ మొదలుపెట్టారు. సినిమాలో కంటెంట్‌ దృష్ట్యా రెండు భాగాలుగా విడుదల చేశారు. ‘యన్‌.టి.ఆర్‌’ కూడా మొదలుపెట్టినప్పుడు ఒక్క సినిమాయే. తీరా షూటింగ్‌ ప్రారంభంచి... సగం చేశాక... రెండు భాగాలుగా విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక, పబ్లిసిటీ విషయంలో కూడా సేమ్‌ టు సేమ్‌ ‘బాహుబలి’ టీమ్‌ అనుసరించిన ఫార్ములాను ‘యన్‌.టి.ఆర్‌’ టీమ్‌ ఫాలో అవుతుంది.
 
‘బాహుబలి’ టీమ్‌ సినిమాలో నటించిన ఎవరి బర్త్‌డే వచ్చినా... వాళ్ళ స్పెషల్‌ స్టిల్‌ లేదా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసింది. ‘యన్‌.టి.ఆర్‌’ టీమ్‌ కూడా అలాగే చేసింది. సినిమాలో చాలామంది అతిథి పాత్రలు చేయడంతో... వాళ్ళ బర్త్‌డేలు వస్తే ఆ అవకాశాన్ని వృధా చేసుకోలేదు. స్పెషల్‌ స్టిల్స్‌, లుక్స్‌ విడుదల చేసింది. ఇంటర్వ్యూలు ఇచ్చే విషయంలోనూ ‘బాహుబలి’ పార్ములాను ‘యన్‌.టి.ఆర్‌’ టీమ్‌ తూ...చా... తప్పకుండా పాటిస్తోంది. తెలుగు మీడియాలో అందర్నీ పిలవకుండా ఎంపిక చేసిన మీడియా సంస్థలను పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తుంది ‘యన్‌.టి.ఆర్‌’ టీమ్‌. తెలుగు పత్రికల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణకు మాత్రమే ‘యన్‌.టి.ఆర్‌’ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలు. వెబ్‌ మీడియా ఈ సంస్థలు చేసిన ఇంటర్వ్యూల్లో అంశాలను రాసుకోవల్సిందే. టీవీ ఛానళ్ళను కూడా పిలవలేదు. రానాతో ఒక ఇంటర్వ్యూ టెలికాస్ట్‌ చేసి విడుదల చేశారు. మొదట విద్యా బాలన్‌, తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్‌, సంగీత దర్శకుడు కీరవాణి, కథానాయకుడు బాలకృష్ణ... ‘యన్‌.టి.ఆర్‌’ టీమ్‌ ముఖ్యులందరూ నాలుగు పత్రికలకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చారు. ‘బాహుబలి’ టీమ్‌ ఈ విధంగా చేయడంతో... వారికి మిగతా మీడియా సంస్థల సెగ తగిలింది. నందమూరి తారక రామారావు మీద ఉన్న అభిమానం కావొచ్చు.. బాలకృష్ణపై ఉన్న భయం భక్తి కావొచ్చు... ఎవరూ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూల కోసం హంగామా చేయడం లేదు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here