సాయితేజ్ హడావిడి వెనుక అసలు కారణం అదే!
on May 24, 2020
‘‘ఏంటి బావా! నీకు పెళ్లంట. నాకు చెప్పలేదు’
– వరుణ్‌తేజ్‌ను ట్విట్టర్లో సాయిధరమ్ తేజ్ అడిగాడు.
‘‘నా పెళ్లికి చాలా టైమ్ ఉందిలే. కానీ, మన రానా దగ్గుబాటి, నితిన్ మాత్రం ఎప్పటికీ మీతోనే అంటూనే సింపుల్‌గా సింగిల్స్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయిపోయారు’’
– వరుణ్‌తేజ్ రిప్లై ఇచ్చాడు.
మధ్యలో ‘వెన్నెల’ కిశోర్, మంచు మనోజ్ వచ్చారు. ‘సింగిల్స్ రాక్. సింగిల్స్ హ్యాపీ’ అన్నారు.
తర్వాత నితిన్ సీన్లో వచ్చాడు.
‘‘బాధపడకండి బ్రదర్స్. మీ నంబర్ కూడా వస్తుంది. అవన్నీ కాదు గానీ, సాయితేజ్... అప్పుడెప్పుడో నా పుట్టినరోజుకి బహుమతి ఇస్తాననీ, లాక్డౌన్ వల్ల ఆగిపోయానని అన్నావ్! నా గిఫ్ట్ ఏది? ఎప్పుడు ఇస్తున్నావ్? అయామ్ వెయిటింగ్’’
– సాయితేజ్‌ని నితిన్ అడిగాడు.
ఈ హడావిడి వెనుక అసలు కారణం వేరే ఉంది. అదేంటంటే... సాయితేజ్ హీరోగా నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ఉంది కదా! అందులో ‘నో పెళ్లి’ అని ఒక పాట ఉంది. మే 25న విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులు దృష్టిని ఆ పాట మీద మరల్చడం కోసమే సోషల్ మీడియాలో ఈ హడావిడి అంతా! ‘‘నితిన్ డార్లింగ్... నేనెప్పుడో గిఫ్ట్ పంపేశా. నీ దగ్గరకు సోమవారం వస్తుంది. నువ్వు ఎప్పుడు ఈ పాటను విడుదల చేస్తావని అందరూ వెయిటింగ్. మా సింగిల్స్ నుండి మీ మింగిల్స్కి ఈ పాట అంకితం ఇస్తున్నాం’’ అని సాయితేజ్ అన్నారు. అదీ అసలు సంగతి.